జయహో బీసీ చైతన్యయాత్ర
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:03 AM
తెలుగుదేశం పార్టీ ‘జయహో బీసీ చైతన్యయాత్ర’ వాహనాలను గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రారంభించారు. టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్, బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు.

అనకాపల్లి టౌన్, జనవరి 11 : తెలుగుదేశం పార్టీ ‘జయహో బీసీ చైతన్యయాత్ర’ వాహనాలను గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రారంభించారు. టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్, బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో బీసీలపై దాడులు, అరాచకాలు పెరిగాయన్నారు. బడ్జెట్‌లో బీసీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి, బీసీ కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేసి వైసీపీ ప్రభుత్వం బీసీల ద్రోహిగా మారిందన్నారు. జగన్‌రెడ్డి నియంతత్వ పోకడలు, అరాచక పాలన, వైసీపీ నేతల ఇసుక, గనులు, ఖనిజాలు, గ్రావెల్ దోపిడీ, భూ ఆక్రమణల గురించి ప్రజలకు వివరించడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమరశెట్టి శ్రీనివాసరావు, మళ్ల సురేంద్ర, గుర్రం నూకరాజు, గింజల లక్ష్మణరావు, బత్తుల లక్ష్మి, వనం శ్రీనివాసరావు, ఆడారి కిశోర్‌కుమార్, జూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.