సబ్బవరంలో జనసేనకు 12,838 ఓట్ల మెజారిటీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:51 AM
మండలంలోని 24 పంచాయతీలుతో పాటు జీవీఎంసీ పరిధిలో 88వ వార్డులో 66, 67, 68 పోలింగ్ బూతుల్లో జనసేన పార్టీ (1 నుంచి 68 బూతులు) అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబుకు 12,838 ఓట్లు మెజారిటీ వచ్చింది.

సబ్బవరం, జూన్ 6 : మండలంలోని 24 పంచాయతీలుతో పాటు జీవీఎంసీ పరిధిలో 88వ వార్డులో 66, 67, 68 పోలింగ్ బూతుల్లో జనసేన పార్టీ (1 నుంచి 68 బూతులు) అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబుకు 12,838 ఓట్లు మెజారిటీ వచ్చింది. మండలంలో 59,597 ఓట్లు ఉండగా.. 50,597 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌కు 16,476 ఓట్లు, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబుకు 29,314 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 4,573 ఓట్లు వచ్చాయి. సబ్బవరంలో 2004 ఓట్లు, అసకపల్లిలో 926 ఓట్లు, నారపాడులో 711 ఓట్లు, వెదుళ్లనరవలో 681, గుల్లేపల్లి 676, గొటివాడ 643, నంగినారపాడులో 610 ఓట్లు పంచకర్లకు మెజారిటీ వచ్చింది. రావలమ్మపాలెంలో 8వ బూతులో వైసీపీకి 45 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. మిగతా అన్ని బూతుల్లో గాజుగ్లాసుకు మెజారిటీ వచ్చింది.