Share News

విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ABN , Publish Date - Feb 23 , 2024 | 01:18 AM

నగరంలో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రెండు మ్యాచ్‌లు పోతినమల్లయ్యపాలెంలో గల ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్నాయి.

విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌

ఏప్రిల్‌ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

విశాఖపట్నం (స్పోర్ట్సు), ఫిబ్రవరి 22:

నగరంలో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రెండు మ్యాచ్‌లు పోతినమల్లయ్యపాలెంలో గల ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్నాయి. ఐపీఎల్‌ షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. ఇందులో రెండు మ్యాచ్‌లు (మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌, ఏప్రిల్‌ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) విశాఖకు కేటాయించారు.

ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను పంజాబ్‌ కింగ్స్‌తో మొహాలిలో, రెండో మ్యాచ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌తో జైపూర్‌లో ఆడనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లతో వరుసగా జరిగే మూడు, నాల్గో మ్యాచ్‌లను విశాఖలో ఆడడం విశేషం.

నాలుగేళ్ల తర్వాత

విశాఖలో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. 2012లో డెక్కన్‌ చార్జర్స్‌, 2015లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, 2016లో ముంబై ఇండియన్స్‌ జట్లు ఆడిన గ్రూపు స్టేజ్‌ మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికైంది. 2019లో ఐపీఎల్‌ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు లేకపోయినా కీలకమైన ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.

Updated Date - Feb 23 , 2024 | 01:18 AM