Share News

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:44 AM

జిల్లాల్లో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 38 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 28,621 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రఽథమ సంవత్సరం 13,323 మంది, ద్వితీయ సంవత్సరం 15,298 మందిచ విద్యార్థులు వున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 38 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 38 మంది సూపరింటెండెంట్లను నియమించారు. కాపీయింగ్‌, ఇతర అక్రమాలు జరక్కుండా రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్‌, నెట్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. అర్ధ గంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. తొమ్మిది గంటలు దాటిన తరువాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని జిల్లా ఇంటర్నీడియట్‌ అధికారిణి సుజాత స్పష్టం చేశారు.

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
నర్సీపట్నం ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్‌

38 కేంద్రాల్లో నిర్వహణ

ఫస్టియర్‌- 13,323 మంది, సెకండియర్‌- 15,298 విద్యార్థులు

అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 144 సెక్షన్‌

పరిసరాల్లో జిరాక్స్‌, నెట్‌ సెంటర్లు మూసివేత

అనకాపల్లి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 38 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 28,621 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రఽథమ సంవత్సరం 13,323 మంది, ద్వితీయ సంవత్సరం 15,298 మందిచ విద్యార్థులు వున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 38 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 38 మంది సూపరింటెండెంట్లను నియమించారు. కాపీయింగ్‌, ఇతర అక్రమాలు జరక్కుండా రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్‌, నెట్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. అర్ధ గంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. తొమ్మిది గంటలు దాటిన తరువాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని జిల్లా ఇంటర్నీడియట్‌ అధికారిణి సుజాత స్పష్టం చేశారు.

ఇదిలావుండగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు సజావుగా జరిపించాలని కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం ఆయా శాఖల అధికారులతో వెబ్‌ఎక్స్‌లో మాట్లాడారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసు స్టేషన్లలో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను పోలీస్‌ బందోబస్తుతో పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లాలన్నారు.

కాగా ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం బడి బస్సులు కాకుండా ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని పీటీడీ అనకాపల్లి డిపో అధికారులు తెలిపారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి, పరవాడ మండలం తానాం, కశింకోట మండలం తాళ్లపాలెం, ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి, చీడికాడ మండలం కోనాంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల విద్యార్థుల కోసం ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:44 AM