జడ్పీ హైస్కూల్‌లో వసతులపై ఆరా
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:48 AM
స్థానిక తులసీనగర్‌లోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో వెంకట లక్ష్మమ్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఇదే పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్లస్-2 విద్యార్థినుల తరగతి గదులను పరిశీలించి వారితో మాట్లాడారు.
- ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో
ఎలమంచిలి, జూలై 30: cఇంగ్లీషు సబ్జెక్టు బోధన సంతృప్తికరంగా లేదని డీఈవోకు విద్యార్థినులు తెలిపారు. ఉచిత పుస్తకాలు అందలేదని విద్యార్థినులు తెలపడంతో వెంటనే పంపిణీ చేయాలని ఎంఈవో 2 అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. స్కూల్ ఆవరణలో మధ్యాహ్న భోజన పథకం వంటలను కట్టెల పొయ్యిలపై వండుతుండడాన్ని పరిశీలించి ఇది నిబంధనలకు విరుద్ధమని, నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అసంతృప్తిగా మధ్య భవన నిర్మాణాలను పరిశీలించి వాటిని వేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంఈవోలు మీనాక్షి, అరుణ్‌కుమార్, ఉపాధ్యాయులు వున్నారు.