Share News

పీవీటీజీ గ్రామాల్లో విద్యుదీకరణ పనులపై ఆరా

ABN , Publish Date - May 29 , 2024 | 12:57 AM

మండలంలోని పలు గ్రామాలను ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథీతేజ్‌ మంగళవారం సందర్శించారు. జన్‌మన్‌ పథకంలో భాగంగా పీవీటీజీ గ్రామాల్లో చేపట్టిన విద్యుదీకరణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మండలంలోని మాదల నందిగుడ కాలనీ, అడపవలస,చిట్టంగొంది గ్రామాలను సందర్శించి అక్కడి ఇళ్లల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ మీటర్లు, వైరింగ్‌కు ఆయన పరిశీలించారు.

పీవీటీజీ గ్రామాల్లో విద్యుదీకరణ పనులపై ఆరా
చిట్టంగొంది గ్రామంలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ మీటరును పరిశీలించడానికి వచ్చిన సీఎండీ పృథ్వీతేజ్‌, విద్యుత్‌శాఖ అధికారులు

- పలు గ్రామాల్లో పర్యటించిన ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ

అరకులోయ, మే 28: మండలంలోని పలు గ్రామాలను ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథీతేజ్‌ మంగళవారం సందర్శించారు. జన్‌మన్‌ పథకంలో భాగంగా పీవీటీజీ గ్రామాల్లో చేపట్టిన విద్యుదీకరణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మండలంలోని మాదల నందిగుడ కాలనీ, అడపవలస,చిట్టంగొంది గ్రామాలను సందర్శించి అక్కడి ఇళ్లల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ మీటర్లు, వైరింగ్‌కు ఆయన పరిశీలించారు. జనమన్‌ పథకంలో భాగంగా గుర్తించిన పీవీటీజీ గ్రామాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఏపీ ఈపీడీసీఎల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ ఎల్‌.మహేంద్రనాథ్‌, పాడేరు కార్యనిర్వాహక ఇంజనీరు ఏవీఎన్‌ఎం.అప్పారావు ఉన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:57 AM