రాజభాష హిందీకి పెరుగుతున్న ఆదరణ
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:01 AM
దేశం మొత్తం ఐక్యంగా ఉంచే మాధ్యమంగా హిందీ భాష కీలకపాత్ర పోషిస్తుందని, శాస్త్రీయ ఆలోచనలు, సాంకేతికతను అనుసంధానం చేయడంలో రాజభాషకు ఆదరణ పెరుగుతుందని డీఆర్‌డీవో డీజీ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. అఖిల భారత సంయుక్త రాజభాష సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సెమినార్ ఎన్‌ఎస్‌టీఎల్‌లోని మానసి ఆడిటోరియంలో గురువారం ప్రారంభమైంది.
డీఆర్‌డీవో డీజీ డాక్టర్ వై.శ్రీనివాసరావు
అఖిల భారత సంయుక్త రాజభాష సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సెమినార్ ప్రారంభం
గోపాలపట్నం, ఫిబ్రవరి 1: దేశం మొత్తం ఐక్యంగా ఉంచే మాధ్యమంగా హిందీ భాష కీలకపాత్ర పోషిస్తుందని, శాస్త్రీయ ఆలోచనలు, సాంకేతికతను అనుసంధానం చేయడంలో రాజభాషకు ఆదరణ పెరుగుతుందని డీఆర్‌డీవో డీజీ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. అఖిల భారత సంయుక్త రాజభాష సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సెమినార్ ఎన్‌ఎస్‌టీఎల్‌లోని మానసి ఆడిటోరియంలో గురువారం ప్రారంభమైంది. డీఆర్‌డీవో హైదరాబాద్ క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ఈ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజభాష అభివృద్ధికి ఎన్‌ఎస్‌టీఎల్ చేస్తున్న కృషిని అభినందించారు. ఎన్‌ఏడీ చీఫ్ జనరల్ మేనేజర్ పీజే నివారే మాట్లాడుతూ దేశ సరిహద్దులను సురక్షితం చేయడంతో డీఆర్‌డీవో ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. సాంకేతికత బదిలీ, సమన్వయానికి ఎన్‌ఎస్‌టీఎల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. డీఆర్‌డీవో డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసింగ్ మాట్లాడుతూ శాస్త్రీయ సమాజంలో రాజభాషను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వరుగీస్ మాట్లాడుతూ నౌకాదళం కోసం అత్యాధునిక ఆయుధాలను తయారుచేయడంలో ఎన్‌ఎస్‌టీఎల్ చేస్తున్న కృషిని వివరించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సెమినార్‌లో జరిగే చైతన్యవంతమైన చర్చలు శాస్త్రీయ, సాంకేతిక పురోగమనానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెమినార్ చైర్మన్ సి.కేదర్‌నాథ్, ఎన్‌ఎస్‌టీఎల్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.