Share News

పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:39 AM

ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చలి, పొగమంచు ప్రభావం సైతం తగ్గుతున్నది. జీకేవీధి, అరకులోయలో 15.8, జి.మాడుగులలో 16.3, అనంతగిరిలో 16.8, పెదబయలులో 17, పాడేరులో 17.4, ముంచంగిపుట్టులో 17.6, డుంబ్రిగుడలో 18.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. దీంతో మన్యంలో కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. పాడేరులోనూ గత రెండు రోజులుగా పొగమంచు కురుస్తూ, చలి తీవ్రత కొనసాగుతున్నది. అలాగే మధ్యాహ్నం వేళల్లో ఎండ ప్రభావం సైతం కాస్త పెరిగింది.

పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు- జి.మాడుగుల మార్గంలో ఆదివారం ఉదయం పొగమంచు

- జీకేవీధి, అరకులోయలో 15.8 డిగ్రీలు

పాడేరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చలి, పొగమంచు ప్రభావం సైతం తగ్గుతున్నది. జీకేవీధి, అరకులోయలో 15.8, జి.మాడుగులలో 16.3, అనంతగిరిలో 16.8, పెదబయలులో 17, పాడేరులో 17.4, ముంచంగిపుట్టులో 17.6, డుంబ్రిగుడలో 18.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. దీంతో మన్యంలో కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. పాడేరులోనూ గత రెండు రోజులుగా పొగమంచు కురుస్తూ, చలి తీవ్రత కొనసాగుతున్నది. అలాగే మధ్యాహ్నం వేళల్లో ఎండ ప్రభావం సైతం కాస్త పెరిగింది.

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం చింతపల్లిలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. రానున్న రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో చలి తీవ్రత, మంచు ఉధృతి తగ్గింది.

Updated Date - Feb 26 , 2024 | 12:39 AM