పెరిగిన చలి తీవ్రత
ABN , Publish Date - Nov 25 , 2024 | 10:58 PM
మన్యాన్ని చలి వీడడం లేదు. గిరిజన ప్రాంతంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.
జి.మాడుగులలో 11.9, డుంబ్రిగుడలో 12.3 డిగ్రీలు నమోదు
చింతపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మన్యాన్ని చలి వీడడం లేదు. గిరిజన ప్రాంతంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. సోమవారం జి.మాడుగులలో 11.9, డుంబ్రిగుడలో 12.3, హుకుంపేటలో 13, పెదబయలు 13.1, చింతపల్లి 13.2, అరకులోయలో 13.3, పాడేరులో 13.5 అనంతగిరిలో 14, కొయ్యూరులో 17.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో ఉదయం, రాత్రి వేళల్లో మంచు అధికంగా కురుస్తున్నది.