Share News

అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభం

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:10 AM

అల్లూరి చరిత్రకు సంబంధించి అద్భుతమైన కళాఖండాలు విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడతాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

 అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభం
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు అల్లూరి చిత్రపటాన్ని అందజేస్తున్న జాతీయ అల్లూరి యువజన సంఘం ప్రతినిధులు

కృష్ణాదేవిపేట: అల్లూరి చరిత్రకు సంబంధించి అద్భుతమైన కళాఖండాలు విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడతాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం అల్లూరి 127వ జయంతిని పురస్కరించుకుని కృష్ణాదేవిపేట సమాధులున్న పార్కులో జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఏర్పాటు చేసిన కళా మందిరాన్ని అయ్యన్న ప్రారంభించారు. ఈ కళా మందిరంలో రాజాజీ మెమోరియల్‌ ఆర్ట్‌ అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మాదేటి రవిప్రకాశ్‌, ఇతర కళాకారులు రూపొందించిన 18/24 వెడల్పు గల అల్లూరి చరిత్రకు సంబంధించిన 32 చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 01:10 AM