Share News

కలెక్టరేట్‌ ఎదుట ‘ఉపాధి’ సిబ్బంది ఆందోళన

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:01 AM

తమ సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ‘ఉపాధి’ సిబ్బంది ఆందోళన
డీఆర్‌వోకు వినతిపత్ర ం అందిస్తున్న దృశ్యం

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని హెచ్చరిక

అనకాపల్లి కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: తమ సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి జి.రవిచంద్ర మాట్లాడుతూ.. 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమకు గ్రేడ్‌లు, కేడర్‌ ఫిక్స్‌ చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీఆర్సీ అమలు చేయాలని, ఎఫ్‌టీఈ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ దయానిధిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి కొండాజీ, శివానీ, దేవకి, సతీశ్‌కుమార్‌, శ్రీను, దశరథ్‌ రామరాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:01 AM