Share News

నిమజ్జనోత్సవం

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:02 AM

వినాయక ఉత్సవాల్లో త్రిరాత్రులు గడిచిపోవడంతో కొంతమంది ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నారు.

నిమజ్జనోత్సవం

సందడిగా మారిన బీచ్‌లు

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీవీఎంసీ

వినాయక ఉత్సవాల్లో త్రిరాత్రులు గడిచిపోవడంతో కొంతమంది ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నారు. దీంతో తీరప్రాంతం సందడిగా మారింది. రుషికొండ, సాగర్‌నగర్‌, ఐటీ హబ్‌, జోడుగుళ్లపాలెం, కోస్టల్‌ బ్యాటరీ ప్రాంతాల్లో సోమవారం భక్తులు వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఇందుకోసం జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రేన్‌లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మేళతాళాలు, భక్తిశ్రద్ధలతో వినాయక ప్రతిమలను తీరానికి తోడ్కొని వచ్చిన భక్తులు సముద్రంలో నిమజ్జనోత్సవం పూర్తిచేశారు. నిమజ్జన ఏర్పాట్లను మెరైన్‌ ఎస్పీ రవివర్మ పరిశీలించారు.

- సాగర్‌నగర్‌

Updated Date - Sep 10 , 2024 | 01:02 AM