బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ చెబితే రూ. 50 వేల నజరానా
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:18 AM
మండలంలోని కొప్పుగొండుపాలెంలో బాలికను హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు బి.సురేశ్ ఆచూకీ చెబితే రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని జిల్లా పోలీస్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాంబిల్లి, జూలై 8 : మండలంలోని కొప్పుగొండుపాలెంలో బాలికను హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు బి.సురేశ్ ఆచూకీ చెబితే రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని జిల్లా పోలీస్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హంతకుడి కోసం పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు.. నిందితుడి వివరాలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. నిందితుడు ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నిందితుడి ఆచూకీ తెలిసినవారు 9440796084, 9440796108, 9440904229 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని పోలీస్ అధికారులు ఆ ప్రకటనలో కోరారు.