నేతల ఇళ్లకు హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:38 AM
రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆదివారం నగరానికి వచ్చిన వంగలపూడి అనిత ఎమ్మెల్యేలు, నేతలను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆదివారం నగరానికి వచ్చిన వంగలపూడి అనిత ఎమ్మెల్యేలు, నేతలను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ అతిథిగృహం, పార్టీ కార్యాలయానికి వస్తే అక్కడే ఎమ్మెల్యేలు, నేతలు కలిసి అభినందిస్తారు. దీనికి భిన్నంగా అనిత ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల ఇళ్లకు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ కార్యాలయానికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నారు.