Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:44 AM

మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు కొద్దిపాటి వర్షం కురిసింది. అయితే విపరీతంగా ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

ఈదురుగాలుల బీభత్సం
పరవాడలో నేలకొరిగిన అరటితోట

- పలుచోట్ల నేలకొరిగిన చెట్లు

- దెబ్బతిన్న అరటితోటలు

- తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పరవాడ, జూన్‌ 1: మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు కొద్దిపాటి వర్షం కురిసింది. అయితే విపరీతంగా ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో అరటితోటలు నేలకొరిగాయి. ఈదురుగాలులు వల్ల శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఈదురుగాలుల వల్ల అరటితోటలతో పాటు బొప్పాయి తోటలు నేలకొరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:44 AM