Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - May 20 , 2024 | 12:47 AM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత నుంచి వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. మురుగుకాల్వలు సైతం వర్షపు నీటితో ప్రవహించాయి. అలాగే జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. తాజా వాతావరణంతో జనం ఊరట చెందుతున్నారు. ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది.

మన్యంలో భారీ వర్షం
సీలేరులో వర్షం

- నైరుతి రుతుపవనాల ప్రభావం

- తగ్గుముఖం పట్టిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

పాడేరు, మే 19(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత నుంచి వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. మురుగుకాల్వలు సైతం వర్షపు నీటితో ప్రవహించాయి. అలాగే జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. తాజా వాతావరణంతో జనం ఊరట చెందుతున్నారు. ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది.

ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు

నైరుతి రుతు పవనాల ప్రభావంతో వాతావరణంలోని మార్పుల కారణంగా ఏజెన్సీలో ఆదివారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనంతగిరిలో 38.8, అరకులోయలో 38.3, చింతపల్లిలో 37.1, డుంబ్రిగుడలో 36.0, జీకేవీధిలో 37.1, జి.మాడుగులలో 37.1, హుకుంపేటలో 38.2, కొయ్యూరులో 39.0, ముంచంగిపుట్టులో 209.3, పాడేరులో 31.8, పెదబయలులో 37.5 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి జనం సేదతీరారు. సీలేరు పరసర ప్రాంతాలైన ధారకొండ, ఒడిశాలోని చిత్రకొండ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.

పెదబయలులో..

పెదబయలు: మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉంది. మఽధ్యాహ్నం వర్షం కురిసింది. వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. జనజీవనానికి కొంత సేపు అంతరాయం కలిగింది.

Updated Date - May 20 , 2024 | 12:47 AM