భారీ వర్షం
ABN , Publish Date - Sep 27 , 2024 | 01:30 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విశాఖ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
సీతమ్మధారలో అత్యధికంగా 4.26 సెం.మీ.
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విశాఖ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. గురువారం తీవ్రత మరింత పెరిగింది. ఉదయం నుంచి దఫదఫాలుగా పడుతూనే ఉంది. గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సీతమ్మధారలోనే 4.26 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పద్మనాభంలో అత్యల్పంగా 5 మి.మీ. నమోదైంది. మొత్తం 11 మండలాల్లో సగటున 2.21 సెం.మీ. కురిసింది. ఈ భారీ వర్షానికి పూర్ణామార్కెట్ జలమయమైంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీచ్‌రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. సందర్శకులు కరువయ్యారు. ఎంవీపీ కాలనీ, కేఆర్‌ఎం కాలనీ, ఇసుకతోట, తదితర ప్రాంతాల్లో గెడ్డల్లో నీరు రోడ్లపైకి వచ్చింది. చాలా కాలనీల్లో నీరు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి ప్రవేశించింది. ఉద్యోగులు, విద్యార్థులు వర్షంలో తడుస్తూనే కార్యాలయాలు, విద్యాలయాలకు వెళ్లారు. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో ఒక్కో మండలంలో సగటున 1.04 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు
------------------------------------------------------------------
మండలం బుధవారం ఉదయం 8 నుంచి
గురువారం మధ్యాహ్నం 2 వరకు
-------------------------------------------------------------------------------
సీతమ్మధార 4.26 సెం.మీ.
విశాఖ రూరల్ 3.94 సెం.మీ.
మహారాణిపేట 3.28 సెం.మీ.
పెందుర్తి 2.36 సెం.మీ.
పెదగంట్యాడ 2.34 సెం.మీ.
గాజువాక 1.94 సెం.మీ.
భీమునిపట్నం 1.74 సెం.మీ.
గోపాలపట్నం 1.68 సెం.మీ.
ములగాడ 1.5 సెం.మీ.
ఆనందపురం 0.72 సెం.మీ.
పద్మనాభం 0.05 సెం.మీ.