Share News

లెఫ్ట్‌నెంట్‌ అధికారిగా గోవింద్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:31 AM

ఇండియన్‌ ఆర్మీలో సాధారణ జవాన్‌ స్థాయి నుంచి సీఎల్‌-1 స్పెషల్‌ ఆఫీసర్‌ (లెఫ్ట్‌నెంట్‌)గా పదోన్నతి సాధించాడు జిల్లాకు చెందిన విజనగరి గోవింద్‌. రావికమతం మండలం జెడ్‌ కొత్తపట్నం పంచాయతీ గంపవానిపాలెం గ్రామానికి చెందిన విజనగిరి రాజారావు, రాజ్యలక్ష్మిల కుమారుడు గోవింద్‌ 2011లో ఆర్మీ ఎలకా్ట్రనిక్స్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ విభాగంలో క్లర్క్‌ (జవాన్‌)గా విధుల్లో చేరారు.

లెఫ్ట్‌నెంట్‌ అధికారిగా గోవింద్‌
కుటుంబసభ్యులతో ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌ అధికారి విజనగరి గోవింద్‌

గంపవానిపాలెం వాసికి అవకాశం

ఆరునెలల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి

నర్సీపట్నం, జూన్‌ 8: ఇండియన్‌ ఆర్మీలో సాధారణ జవాన్‌ స్థాయి నుంచి సీఎల్‌-1 స్పెషల్‌ ఆఫీసర్‌ (లెఫ్ట్‌నెంట్‌)గా పదోన్నతి సాధించాడు జిల్లాకు చెందిన విజనగరి గోవింద్‌. రావికమతం మండలం జెడ్‌ కొత్తపట్నం పంచాయతీ గంపవానిపాలెం గ్రామానికి చెందిన విజనగిరి రాజారావు, రాజ్యలక్ష్మిల కుమారుడు గోవింద్‌ 2011లో ఆర్మీ ఎలకా్ట్రనిక్స్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ విభాగంలో క్లర్క్‌ (జవాన్‌)గా విధుల్లో చేరారు. 13 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత 2023 మార్చిలో బెంగళూరులో నిర్వహించిన ఎస్‌ఎస్‌బీ (సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు) ఇంటర్వ్యూలో ఇండియన్‌ ఆర్మీ స్పెషల్‌ ఆఫీసర్స్‌ విభాగంలో సీఎల్‌-1 స్పెషల్‌ కమిషన్‌ ఆఫీసరు (లెఫ్ట్‌నెంట్‌)గా ఎంపికయ్యారు. బిహార్‌ రాష్ట్రంలోని గయాలో ఆర్మీ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఆరు నెలలు శిక్షణ పూర్తిచేసుకుని శనివారం ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఇండియన్‌ ఆర్మీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్ట్‌నెంట్‌ హోదాలో రాజస్థాన్‌లోని బార్మర్‌లో విధులు నిర్వర్తించనున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:31 AM