Share News

గిడ్డి ఈశ్వరికే చాన్స్‌?

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:18 AM

తెలుగుదేశం పార్టీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లు వెంకట రమేశ్‌నాయుడును మార్చాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య శుక్రవారం ఫోన్‌ ద్వారా తెలిపారు. అలాగే ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించిన రమేశ్‌నాయుడుకి, టికెట్‌ పొందబోయే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశఽ్వరికి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఆయన శ్రావణ్‌కుమార్‌కు సూచించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌.. రమేశ్‌నాయుడు, గిడ్డి ఈశ్వరిలతో వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సంప్రతించగా... అభ్యర్థిని మార్చుతున్న విషయం నిజమేనని, అధిష్ఠానం సూచనలతో ఈ విషయాన్ని రమేశ్‌నాయుడు, గిడ్డి ఈశ్వరికి తెలిపానన్నారు.

గిడ్డి ఈశ్వరికే చాన్స్‌?
గిడ్డి ఈశ్వరి

గిడ్డి ఈశ్వరికే చాన్స్‌?

టీడీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు

- అభ్యర్థి మార్పుపై రమేశ్‌నాయుడు, గిడ్డి ఈశ్వరికి మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ ద్వారా కబురు

- నియోజకవర్గంపై ఈశ్వరి పట్టు సాధించడమే కారణం

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

తెలుగుదేశం పార్టీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లు వెంకట రమేశ్‌నాయుడును మార్చాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య శుక్రవారం ఫోన్‌ ద్వారా తెలిపారు. అలాగే ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించిన రమేశ్‌నాయుడుకి, టికెట్‌ పొందబోయే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశఽ్వరికి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఆయన శ్రావణ్‌కుమార్‌కు సూచించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌.. రమేశ్‌నాయుడు, గిడ్డి ఈశ్వరిలతో వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సంప్రతించగా... అభ్యర్థిని మార్చుతున్న విషయం నిజమేనని, అధిష్ఠానం సూచనలతో ఈ విషయాన్ని రమేశ్‌నాయుడు, గిడ్డి ఈశ్వరికి తెలిపానన్నారు.

నియోజకవర్గంపై పట్టు సాధించడమే కారణం

అనూహ్య రీతిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌నాయుడు మార్పు జరగడం ప్రస్తుతం మన్యంలో చర్చనీయాంశమైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నియోజకవర్గంపై సంపూర్ణమైన పట్టు సాధించడమే ఇందుకు కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి నెల క్రితమే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికే టికెట్‌ దక్కాల్సి ఉన్నా, నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్‌ నేతలు వర్గాలుగా విడిపోవడం, తదితర కారణాలతో కొత్త వ్యక్తికి టికెట్‌ ఇస్తే బాగుంటుందని పార్టీ భావించింది. దీంతో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఈ ఏడాది జనవరి 4న టీడీపీలో చేరిన కిల్లు వెంకట రమేశ్‌నాయుడుకి స్థానిక ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. అయితే నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసి, పట్టు సాధించిన పార్టీ ఇన్‌చార్జికి టికెట్‌ దక్కకపోవడంపై నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన నేతలు అసంతృప్తి చెందారు. దీంతో రెబల్‌గా నైనా ఎన్నికల బరిలో దిగాలని గిడ్డి ఈశ్వరిని టీడీపీ శ్రేణులు కోరాయి. దీంతో ఆమె రెబల్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రమేశ్‌నాయుడు ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న చర్యలు, నియోజకవర్గంలోని స్థితిగతులపై నిర్వహించిన సర్వేలో ఆయనకు ప్రతికూలమైన ఫలితాలు వచ్చాయని తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి అయితేనే గెలుపు ఖాయమనే ప్రచారం నియోజకవర్గంలో విస్తృతంగా జరగడంతో అభ్యర్థి మార్పుపై టీడీపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. దీంతో గిడ్డి ఈశ్వరికే టికెట్‌ ఇస్తామని టీడీపీ అరకులోయ పార్లమెంట్‌ స్థానం అధ్యక్షుడు, మాజీ కిడారి శ్రావణ్‌కుమార్‌ ద్వారా అధిష్ఠానం చెప్పించింది. దీంతో ఆమె శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను కలిసేందుకు వెళ్లనున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:18 AM