Share News

నేడు గాజువాక పరస: పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:04 AM

గాజువాకలోని బీసీ రోడ్డులో ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే సీతారామ ఉమారామలింగేశ్వరస్వామి పరస శుక్రవారం జరగనున్నది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు ఆవిష్కరించారు.

నేడు గాజువాక పరస: పోస్టర్‌ ఆవిష్కరణ
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులు

గాజువాక, ఫిబ్రవరి 1: గాజువాకలోని బీసీ రోడ్డులో ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే సీతారామ ఉమారామలింగేశ్వరస్వామి పరస శుక్రవారం జరగనున్నది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు ఆవిష్కరించారు. ఈ సంవత్సరం కూడా పరసను వైభవంగా నిర్వహించనున్నామని, భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మద్ది శంకరరెడ్డి, పిల్లా శంకర్‌రావు, గంధం శ్రీను, దొడ్డి రమణ, గోమాడ వాసు, తదితరులు పాల్గొన్నారు.

14న సీతారాముల పరస

అక్కిరెడ్డిపాలెం: ఇక్కడి హరిజన జగ్గయ్యపాలెంలో సీతారాముల పరసను ఈ నెల 14న నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కరపత్రాలను కాలనీ నాయకులు ఆవిష్కరించారు. కాలనీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మడి రామాంజనేయులు, వంగలపూడి గోపి మాట్లాడుతు పరస సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు జి.సుబ్రహ్మణ్యం, యు.సుందరరావు, రవి, నాగేశ్‌, ఈశ్వరరావు, వసంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:04 AM