Share News

సప్పర్ల రెయిన్‌గేజ్‌ వద్ద అడవులు ఆహుతి

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:51 AM

జీకే వీధి మండలం సప్పర్ల రెయిన్‌గేజ్‌ అటవీ ప్రాంతంలో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవులు కాలిబూడిద అవుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సప్పర్ల రెయిన్‌గేజ్‌ వద్ద అడవులు ఆహుతి
సప్పర్ల రెయిన్‌గేజ్‌ ప్రాంతంలో చెట్లు కాలి బూడిదైన దృశ్యం

- అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురి డిమాండ్‌

సీలేరు, ఏప్రిల్‌ 6: జీకే వీధి మండలం సప్పర్ల రెయిన్‌గేజ్‌ అటవీ ప్రాంతంలో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవులు కాలిబూడిద అవుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ఈ ప్రాంతంలో అడవులు దహనం కావడానికి ఆకతాయిల పనా?, లేక పోడు వ్యవసాయం కోసం ఎవరైనా అడవులకు నిప్పు పెడుతున్నారా? అనేది తెలియడం లేదు. అడవులు దహనమై దట్టమైన పొగ రావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి అడవులను సంరక్షిం చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:51 AM