Share News

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:07 AM

స్పందనలో కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత జిల్లా అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ఠ, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి, డీఆర్‌వో పద్మావతిలతో కలిసి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

అర్జీల పరిష్కారానికి   ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఐటీడీఏలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఎం.విజయసునీత, అధికారులు

అధికారులకు కలెక్టర్‌ విజయసునీత ఆదేశం

ఐటీడీఏ స్పందనలో 75 వినతులు స్వీకరణ

కార్యక్రమానికి గైర్హాజరైన ఐదుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసలు

పాడేరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): స్పందనలో కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత జిల్లా అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ఠ, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి, డీఆర్‌వో పద్మావతిలతో కలిసి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖాధికారులకు పంపి సత్వరమే పరిష్కారానికి చొరవచూపాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన నాటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, అందువల్ల పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పందన కార్యక్రమానికి సమయపాలన పాటించాలని, అన్ని శాఖలకు చెందిన అధికారులు విధిగా హాజరుకావాని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

స్పందనలో 75 వినతులు స్వీకరణ

ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 75 వినతులను అధికారులు స్వీకరించారు. పాడేరు మండలం మినుములూరు సర్పంచ్‌ లంకెల చిట్టెమ్మ.. తమ పంచాయతీ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలు, స్తంభాలను సరిచేయాలని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. హకుంపేట మండలం కొట్నాపల్లిలో నల్లరాయి క్వారీ వల్ల తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, క్వారీని నిలుపుదల చేయాలని ఆ గ్రామానికి చెందిన కె.చిట్టిబాబు, తదితరులు వినతిపత్రం అందించారు. హుకుంపేట మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలకు ర్యాంప్‌లు నిర్మించానని, ఈ పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని జె.వరహాలు అనే కాంట్రాక్టర్‌ కోరారు. ఇదే మండలం మజ్జివలస నుంచి కొండయ్యపాడు గ్రామం వరకు ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని బూర్జ ఎంపీటీసీ సభ్యుడు మజ్జి హరి వినతిపత్రం సమర్పించారు. చింతపల్లి మండలం అంజలిశనివారం పంచాయతీ మాడెంబంధ గ్రామం నుంచి పాలమామిడి గ్రామానికి రోడ్డు నిర్మించాలని సీహెచ్‌.రామారావు వినతిపత్రం అందించారు. పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ నందిగరువు నుంచి 12వ మైలురాయి వరకు రోడ్డు నిర్మించాలని నందిగరువు గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సి.జమాల్‌బాషా, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ంఎం.రాజు, పంచాయతీరాజ్‌ ఈఈ టి.కొండయ్యపడాల్‌, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, ఎస్‌డీఎస్‌ వీవీఎస్‌.శర్మ, పశు సంవర్థక శాఖ ఉపసంచాలకుడు నరసింహులు, ఐటీడీఏ ఏవో హేమలత, డీఎల్‌ పీవో పీఎస్‌.కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

స్పందనకు రాని ఐదుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి హాజరుకాని ఐదుగురు జిల్లా అధికారులకు కలెక్టర్‌ విజయ సునీత షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని తెలిసింది. జిల్లా ఖజానా అధికారి ప్రసాద్‌బాబు, దేవదాయ శాఖ అధికారి ఎస్‌.చంద్రశేఖర్‌, జిల్లా రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ ఎన్‌.తులసీపద్మ, జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి కె.అప్పలరాములు స్పందనకు హాజరుకాలేని గుర్తించి కలెక్టర్‌ వారికి తాఖీలు జారీ చేశారు. స్పందన కార్యక్రమానికి అధికారులు విధిగా హాజరుకావాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - Mar 16 , 2024 | 01:07 AM