Share News

మత్స్యకారులకు వేట నిషేధ భృతిని వెంటనే ఇవ్వాలి

ABN , Publish Date - May 24 , 2024 | 11:58 PM

వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతిని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

మత్స్యకారులకు వేట నిషేధ భృతిని వెంటనే ఇవ్వాలి

కొత్తూరు, మే 24 : వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతిని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 14 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినప్పటికీ ఇంత వరకూ వేటలేని మత్స్యకారులకు పరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. మత్స్యకారులు ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రూ.10వేలు భృతి ఇచ్చారని, ఆ మొత్తం ఎటూ సరిపోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారన్నారు. నేటికి నెల గడుస్తున్నప్పటికీ భృతి ఇవ్వకపోవడం సరైందికాదన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను తాకట్టు పెట్టుకొనే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే మత్స్యకారులకు జీవనభృతిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 24 , 2024 | 11:58 PM