కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:17 AM
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరు స్థానాలకు అభ్యర్థులు ప్రకటన
విశాఖఫట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఆరు స్థానాలు ఉన్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి గుత్తుల శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం నుంచి పిరిడి భగత్, పాయకరావుపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బోని తాతారావు, అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఇళ్ల రామ గంగాధరరావు, మాడుగుల నియోజకవర్గం నుంచి బీబీఎస్ శ్రీనివాసరావు, పాడేరు నియోజకవర్గం నుంచి సతిక బుల్లిబాబు పోటీ చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని మిగిలిన తొమ్మిది అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఈ నెల ఎనిమిదో తేదీన ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.