Share News

అరకొరగా పాఠ్య పుస్తకాలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:46 AM

అరకొరగా పాఠ్య పుస్తకాలుఅరకొరగా పాఠ్య పుస్తకాలుఅరకొరగా పాఠ్య పుస్తకాలు

అరకొరగా పాఠ్య పుస్తకాలు
ఎంఆర్‌సీకి చేరిన పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న ఎంఈఓ, తదితరులు

పోటోరైటప్‌-1) (11ఆర్‌ల్‌జి 1)

పాఠశాలలు రేపు పునఃప్రారంభం

ఆందోళనలో విద్యార్థులు

రోలుగుంట, జూన్‌ 11:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచితంగా అందించాల్సిన పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో వారిలో ఆందోళన రేగుతోంది. రోలుగుంట మండలానికి అరకొరగా పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యార్ధులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటి వరకు అరకొరగా పాఠ్యపుస్తకాలు రావడంతో విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి పాఠ్యపుస్తకాలు, యూనీఫాం, బూట్లు, బ్యాగులు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యలో కేవలం 65 శాతం మేర మాత్రమే పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. మండలంలో 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, రెండు ప్రాథమికోన్న పాఠశాలలు, తొమ్మిది ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా 35 శాతం పుస్తకాలు సరఫరా కావాల్సి ఉండడంతో అందరు విద్యార్థులకు అందే అవకాశాలు లేవు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 28వేల పాఠ్యపుస్తకాలు అవసరమని అధికారులు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపగా, కేవలం 18,219 మాత్రమే వచ్చాయి. 7వ తరగతికి సంబంధించి రెండు సబ్జెక్టుల పుస్తకాలు మాత్రమే రాగా, 8,9,10 తరగతులకు అన్ని పాఠ్యపుస్తకాలు వచ్చాయి. విద్యార్ధులకు అవసరమైన బూట్లు, యూనిఫాం, బెల్టులు, స్కూల్‌ బ్యాగులు, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు కూడా సరఫరా కాలేదు.

వారంలో పూర్తిస్థాయి సరఫరా

ప్రస్తుతం 1 నుంచి 10 తరగతి వరకు 18,219 పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రభుత్వం పంపించింది. మిగిలిన పుస్తకాలు వారం రోజుల్లో రానున్నాయి. ఈ విద్యాసంవత్సం ప్రారంభమైన వెంటనే అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో అందిస్తాం. విద్యార్థులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- జాన్‌ ప్రసాద్‌, ఎంఈఓ

Updated Date - Jun 12 , 2024 | 12:46 AM