విరివిగా మొక్కల పెంపకం
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:32 PM
కార్పొరేట్ సంస్థల సహకారంతో పార్కుల్లో, అటవీ భూముల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్టు సీసీఎఫ్ ఎస్.శ్రీకంఠనాథరెడ్డి తెలిపారు. మండలంలో మంగళవారం టేకు కలప డిపోలో నిర్వహించిన వేలం పాటకు ఆయన హాజరయ్యారు.
సీసీఎఫ్ శ్రీకంఠనాథరెడ్డి
గొలుగొండ, ఫిబ్రవరి 6: కార్పొరేట్ సంస్థల సహకారంతో పార్కుల్లో, అటవీ భూముల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్టు సీసీఎఫ్ ఎస్.శ్రీకంఠనాథరెడ్డి తెలిపారు. మండలంలో మంగళవారం టేకు కలప డిపోలో నిర్వహించిన వేలం పాటకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఏడాది టేకు కలప ద్వారా రూ.8 కోట్ల 37 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చినట్టు తెలిపారు. టేకు కలప సీఫీజు ద్వారా రూ.2 కోట్ల 14 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. 257 హెక్టార్లలో కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారంతో వివిధ రకాలైన మారుజాతి ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ ఫారెస్ట్ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఐదుకోట్ల మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. విశాఖలోని ఇందిరా గాంధీ జూపార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్‌టీపీసీ చేపడుతుందన్నారు. అరకులో ఈకో పార్కు అభివృద్ది చేశామన్నారు. తాబేళ్ల అభివృద్ధికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో గల టేకు కలప డిపోల్లో 800 క్యూబిక్‌ల మీటర్లు, విజయనగరంలో వంద, అనంతగిరిలో 140 క్యూబిక్ మీటర్ల టేకు కలప వేలానికి సిద్ధంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్, సబ్ డీఎఫ్ సునీల్‌కుమార్, రేంజర్ శ్రీనివాస్, అటవీ అధికారి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.