జిల్లాలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:41 PM
వరదల తీవ్రత కొనసాగుతుండడంతో జిల్లాలోని విద్యాలయాలకు సెలవులను పొడిగిస్తూ కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదివారం అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ దినేశ్‌కుమార్ ప్రకటన
నేడు జిల్లా వ్యాప్తంగా సెలవు
నేడు, రేపు ముంపు మండలాల్లో సెలవులు
పాడేరు,. జూలై 21(ఆంధ్రజ్యోతి): వరదల తీవ్రత కొనసాగుతుండడంతో జిల్లాలోని విద్యాలయాలకు సెలవులను పొడిగిస్తూ కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదివారం అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 22న జిల్లా వ్యాప్తంగా, 23న చింతూరు డివిజన్‌లోని నాలుగు ముంపు మండలాలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలకు 19, 20 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో సోమవారం(22తేదీన) సైతం జిల్లా వ్యాప్తంగా 22 మండలాల విద్యాలయాలకు సెలవును పొడిగించారు. అలాగే జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌లోని చింతూరు, కూనవరం, ఏటపాక, వీఆర్.పురం మండలాల్లో వరద ముంపు ప్రభావం అధికంగా ఉండడంతో సోమ, మంగళవారాలు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.