Share News

ప్రతి అంశంపై క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:34 AM

ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే శిక్షణలో ప్రతి అంశంపై క్షుణ్ణంగా శిక్షణ అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత సూచించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల శిక్షణ మాస్టర్‌ ట్రైనర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రతి అంశంపై క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత, పక్కన ఆర్‌వోలు భావన, అభిషేక్‌

- కలెక్టర్‌ విజయసునీత సూచన

- ఎన్నికల శిక్షణ నిర్వహించే మాస్టర్‌ ట్రైనర్లతో సమావేశం

పాడేరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే శిక్షణలో ప్రతి అంశంపై క్షుణ్ణంగా శిక్షణ అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత సూచించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల శిక్షణ మాస్టర్‌ ట్రైనర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా మనకు అన్నీ తెలుసుననే భావనతో ఎవరూ ఉండకూడదన్నారు. ప్రతి చిన్న విషయాన్ని సైతం సీరియస్‌గానే తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చే సూచనలు, సలహాలను గమనిస్తూ వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీంతో శిక్షణలో ఎప్పటికప్పుడు నవీకరణకు తోడ్పడతాయన్నారు. తాజా సమాచారాన్ని అందించడంలో అలసత్వం, జాప్యం చేయకూడదన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ భయాందోళనకు గురికావద్దని కలెక్టర్‌ సూచించారు. ఈవీఎంల వినియోగంలో చిన్న పొరపాటు సైతం జరగకూడదని, ఈ క్రమంలో పొరపాట్లు జరిగే అవకాశాలు, వాటిని సరిదిద్దే అంశాలను ఎన్నికల సిబ్బందికి అర్థమయ్యే రీతిలో శిక్షణ అందించాలన్నారు. ప్రతి చిన్న విషయం సైతం అట్టడుగు స్థాయి సిబ్బందికి సైతం చేరేలా శిక్షణ నిర్వహించాలన్నారు. ఓటింగ్‌ పూర్తయిన తరువాత నాలుగు రకాల సీళ్లు వేయాలని, ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య ఈవీఎంలో చూపించిన సంఖ్య, పీవో డైరీలో వున్న సంఖ్య, ఓటింగ్‌ స్లిప్పులు, తదితర ఐదు విభాగాల్లోని నంబర్లు సైతం ఒకేలా ఉండాలన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ విజయసునీత సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు భావన వశిష్ట, అభిషేక్‌, ఏఎస్‌పీ కె.ఽధీరజ్‌, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:34 AM