Share News

ఉపాధ్యాయులుకు ఎన్నికల విధులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:10 AM

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.

ఉపాధ్యాయులుకు ఎన్నికల విధులు

ఎన్నికల సంఘం ఆదేశాలు...విద్యా శాఖ నుంచి వివరాలు సేకరించిన కలెక్టర్‌

జిల్లాలో సుమారు 3,200 మంది

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో గల సుమారు 3,200 మంది ఉపాధ్యాయుల వివరాలతో విద్యా శాఖ అధికారులు నివేదిక రూపొందించి జిల్లా ఉన్నతాధికారులకుపంపారు. మండల, జిల్లా పరిషత్‌, జీవీఎంసీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ నుంచి ప్రధానోపాధ్యాయుడి వరకూ అందరి వివరాలు పంపించారు. ఉపాధ్యాయులతో పాటు విద్యా శాఖలో బోధనేతర సిబ్బంది వివరాలు కూడా సేకరించారు. వాస్తవానికి ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. వారి స్థానంలో సచివాలయ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు వెళ్లడంతో టీచర్ల సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి సమాచారం రావడంతో టీచర్ల వివరాలు పంపాలని కలెక్టర్‌ మూడు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.

Updated Date - Jan 12 , 2024 | 06:34 AM