Share News

ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తి

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:11 AM

సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.

ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తి

సీఈవోకు వివరించిన జిల్లా కలెక్టర్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌అశోక్‌, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఫకీరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 1,941 కేంద్రాల్లో ఫర్నిచర్‌, తాగునీరు, తదితర ఏర్పాట్లన్నీ పూర్తిచేశామన్నారు. పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:11 AM