ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:34 AM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ ఇంగ్లీషు మీడియం స్కూలులో అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- హెచ్‌ఎంలకు ఆర్‌జేడీ విజయభాస్కర్ ఆదేశం
కశింకోట, జూన్ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ ఇంగ్లీషు మీడియం స్కూలులో అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతో ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం.వెంకటలక్ష్మమ్మ, ఉప విద్యాశాఖాధికారి ఇ.అప్పారావు, ఎంఈవో చిట్టిబాబు, ఎంఈవో-2 మూర్తి, 300 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.