ఈసెట్‌లో సత్తాచాటారు
ABN , Publish Date - May 31 , 2024 | 01:16 AM
ఈసెట్ (ఇంజనీరింగ్ ద్వితీయ ఏడాదిలో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారికి నిర్వహించే పరీక్ష) ఫలితాల్లో నగరంలోని మురళీనగర్‌కు చెందిన కిల్లి శ్రీరామ్ మెకానికల్ విభాగంలో 169 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
మెకానికల్ విభాగంలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు
ఈఈఈ, కెమికల్‌లో ద్వితీయ ర్యాంకులు
90.11 శాతం ఉత్తీర్ణత
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
ఈసెట్ (ఇంజనీరింగ్ ద్వితీయ ఏడాదిలో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారికి నిర్వహించే పరీక్ష) ఫలితాల్లో నగరంలోని మురళీనగర్‌కు చెందిన కిల్లి శ్రీరామ్ మెకానికల్ విభాగంలో 169 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇదే కేటగిరీలో మర్రిపాలెం ప్రాంతానికి చెందిన ధార కార్తీక్ 160 మార్కులతో ద్వితీయ ర్యాంకు, ఈఈఈ కేటగిరీలో గోపాలపట్నానికి చెందిన ఉప్పల ధరణి 155 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్‌లో యారాడ గ్రామానికి చెందిన బి.మనోహర్ 161 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. అనంతపురం జేఎన్‌టీయూ నిర్వహించిన ఈసెట్‌కు జిల్లా నుంచి 6372 మంది విద్యార్థులు హాజరుకాగా 5,742 మంది (90.11 శాతం) అర్హత సాధించారు.
గాజువాక విద్యార్థినికి ఐసెట్‌లో మూడో ర్యాంకు
జిల్లా నుంచి 5,842 మంది
పరీక్షకు హాజరు...5,735 మంది పాస్
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ఎంబీఏ/ఎంసీఏల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లా పరిధిలోని గాజువాకకు చెందిన సూరిశెట్టి వసంతలక్ష్మి మూడో ర్యాంకు సాధించింది. ఈనెల ఆరో తేదీన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 200 మార్కులకుగాను వసంతలక్ష్మి 167.07 సాధించి మూడో స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి ఈ పరీక్షకు 5,842మంది హాజరుకాగా 5,735 మంది (98.16 శాతం) ఉత్తీర్ణులయ్యారు.