Share News

నేడు దుర్గ్‌-విశాఖ వందేభారత్‌ రైలు ప్రారంభం

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:23 AM

దుర్గ్‌-విశాఖతోపాటు దేశవ్యాప్తంగా మరికొన్ని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

నేడు దుర్గ్‌-విశాఖ వందేభారత్‌ రైలు ప్రారంభం

ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌ సర్వీసులు

గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు అందుబాటు

విశాఖపట్నం, సెప్టెంబరు 15:

దుర్గ్‌-విశాఖతోపాటు దేశవ్యాప్తంగా మరికొన్ని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విశాఖ-దుర్గ్‌ మధ్య కొత్తగా ప్రవేశపెడుతున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఈ సర్వీసులు గురువారం మినహా వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తాయి. దుర్గ్‌-విశాఖ (నంబరు 20829 ) రైలు ప్రతి ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 5.45 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖ చేరుతుంది. అదే రైలు నంబరు 20830తో విశాఖలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌ చేరుతుంది. 16 కోచ్‌లతో నడిచే ఈ రైలు రాయపూర్‌, మహా సముంద్‌, ఖరియార్‌ రోడ్డు, కంటాబంజి, టిట్లాఘర్‌, కెసింగ, రాయగడ, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.

విశాఖ నుంచి నాలుగో వందేభారత్‌ రైలు

విశాఖ నుంచి ప్రస్తుతం మూడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తుండగా, విశాఖ-దుర్గ్‌ మధ్య కొత్తగా ప్రవేశపెట్టే రైలు నాలుగోది కావడం విశేషం. విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రెండు రైళ్లు, విశాఖ- భువనేశ్వర్‌ మధ్య ఒకటి నడుస్తుండగా, నాలుగో రైలు విశాఖ-దుర్గ్‌-విశాఖ మధ్య అందుబాటులోకి రానుంది.

Updated Date - Sep 16 , 2024 | 01:23 AM