Share News

రేవుపోలవరంలో తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:29 AM

మండలంలోని రేవుపోలవరంలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. గ్రామంలో నాలుగు రోజుల నుంచి కొళాయిల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

రేవుపోలవరంలో తాగునీటి కష్టాలు
మోటారు నీరు పట్టుకుంటున్న స్థానిక మహిళలు

ఎస్‌.రాయవరం, జూన్‌ 7: మండలంలోని రేవుపోలవరంలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. గ్రామంలో నాలుగు రోజుల నుంచి కొళాయిల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మోటారు ఉన్న ఇంటి యజమానిని అడిగి తాగునీటిని మహిళలు పట్టుకుంటున్నారు. విద్యుత్‌ సమస్య కారణంగా కొళాయిలు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని గ్రామ మహిళలు కోరుతున్నారు. ఈ సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. విద్యుత్‌ సమస్య కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్‌ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:29 AM