Share News

ఎన్‌రోల్‌మెంట్‌కు అధ్యాపకులు ఇంటింటా ప్రచారం

ABN , Publish Date - May 23 , 2024 | 12:45 AM

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు అధ్యాపకులు ఇంటింటికి వెళ్లిప్రచారం చేస్తున్నారు.

ఎన్‌రోల్‌మెంట్‌కు అధ్యాపకులు ఇంటింటా ప్రచారం
విద్యార్థినికి బ్రోచర్‌ అందజేస్తున్న అధ్యాపకులు

కోటవురట్ల, మే 22: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు అధ్యాపకులు ఇంటింటికి వెళ్లిప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది టెన్త్‌ క్లాసు పాస్‌ అయిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రైవేట్‌ కాలేజ్‌లకు దీటుగా బోధన చేస్తామని, కళాశాలలో మెరుగైనా మౌలిక సదుపాయలు ఉన్నాయని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది కళాశాలలో ఇంటర్‌ ఫలితాలలో అనేకమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బ్రోచర్స్‌ను అందజేస్తున్నారు. బుధవారం మండలంలో యండపల్లి, సుంకపూర్‌, లింగాపురం, తంగేడు గ్రామాల్లో అధ్యాపకులు బృందం ఇంటింటికి తిరిగి విద్యార్లు ఎన్‌రోల్‌మెంట్‌ పెంపునకు కృషి చేస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 12:45 AM