మైదాన ప్రాంతంలోనూ డోలీ మోతలు!
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:20 AM
మండలంలోని జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గిరిజన గ్రామానికి కనీస రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని, పురిటి నొప్పులు వచ్చిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టాల్సిందే. గ్రామానికి చెందిన చదల వెంకటలక్ష్మి అనే గర్భిణికి బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి.

గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అవస్థలు
మాడుగుల రూరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గిరిజన గ్రామానికి కనీస రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని, పురిటి నొప్పులు వచ్చిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టాల్సిందే. గ్రామానికి చెందిన చదల వెంకటలక్ష్మి అనే గర్భిణికి బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. రహదారి బురదగా వుండడంతో ఆటోలు, అంబులెన్స్ గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు డోలీ కట్టి, వర్షంలో తడుస్తూ మొబైల్ ఫోన్ టార్చి లైట్ల వెలుగులో వెంకటలక్ష్మిని సుమారు కిలోమీటరు దూరంలో వున్న ఉన్న రావిపాలెం గ్రామానికి చేర్చారు. అక్కడ నుంచి ఆటోలో మాడుగుల సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. డాక్టర్లు సేవలు అందించి సాధారణ ప్రసవ ం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు.