30నే సామాజిక పింఛన్లు పంపిణీ
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:39 AM
వచ్చే నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో సామాజిక పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే...ఈనెల 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పింఛన్‌దారుల జాబితాతోపాటు సొమ్ములు విడుదల చేశారు. ఈనెల 29వ తేదీన సచివాలయాల సిబ్బందికి పింఛన్ మొత్తం అందజేస్తారు. 30వ తేదీ ఉదయం నుంచే పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు.

జిల్లాలో 1,61,584 మంది పెన్షన్‌దారులు
రూ.69,71,66,500 విడుదల
ఈ నెల తీసుకోని వారికి ఫిబ్రవరిలో అందుకునే అవశాశం
విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో సామాజిక పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే...ఈనెల 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పింఛన్‌దారుల జాబితాతోపాటు సొమ్ములు విడుదల చేశారు. ఈనెల 29వ తేదీన సచివాలయాల సిబ్బందికి పింఛన్ మొత్తం అందజేస్తారు. 30వ తేదీ ఉదయం నుంచే పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు.
జిల్లాలో అన్నిరకాల పెన్షన్‌దారులు కలిపి 1,61,584 మంది ఉన్నారు. వీరికి రూ.69,71, 66,500 అందజేస్తారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,732 మందికి రూ.11,13,86,500, జీవీఎంసీ పరిధిలోని ఏడు జోన్‌లలో 1,34,852 మందికి రూ.58,57,80,500 పంపిణీ చేయనున్నారు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి మూడో తేదీ మధ్య మాత్రమే పింఛన్లు తీసుకోవాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. డిసెంబరు మొదటి వారంలో పింఛన్ తీసుకోకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల పింఛన్‌తో కలిపి మూడు (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి) నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే సదరు పింఛన్‌దారు వలస వెళ్లినట్టుగా పరిగణిస్తారు. అందువల్ల పింఛన్‌దారులు వీలును బట్టి ప్రతినెలా మొదటి వారంలోనే తీసుకోవాలని, అనివార్య కారణాల ఇబ్బంది వస్తే మూడు నెలల వరకూ పింఛన్ తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.