Share News

భీమిలి ఆర్డీవోపై క్రమశిక్షణ చర్యలు

ABN , Publish Date - Sep 19 , 2024 | 01:15 AM

భీమిలి ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ రూరల్‌ మండలం మధురవాడ సర్వే నంబరు 133లో 3.47 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు నివేదిక సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు.

భీమిలి ఆర్డీవోపై క్రమశిక్షణ చర్యలు

ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు నివేదిక సమర్పించారని అభియోగం

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

భీమిలి ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ రూరల్‌ మండలం మధురవాడ సర్వే నంబరు 133లో 3.47 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు నివేదిక సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆయనతోపాటు మరో ముగ్గురు ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి బుధవారం జారీచేసిన జీవో ఓపెన్‌ కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Sep 19 , 2024 | 01:15 AM