Share News

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:46 AM

రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి జరగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ

వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలి

‘అనకాపల్లి’ ఉమ్మడి అభ్యర్థి కొణతాల పిలుపు

అనకాపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి జరగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనవల్ల అభివృద్ధి కుంటుపడిందని, అందువల్ల రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరారవు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని ఆరోపించారు. నాయకులెవరూ భేషిజాలకు పోవద్దని, అనకాపల్లిలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మూడు పార్టీల శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. పీలా గోవింద మాట్లాడుతూ, రాష్ట్రంలో భావితరాల బాగు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్నదే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అనకాపల్లి టౌన్‌, కశింకోట, అనకాపల్లి మండలాలకు చెందిన నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:47 AM