Share News

సమష్టి కృషితో అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:49 PM

అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున అన్నారు. ప్రభుత్వ నిధులు, దాతల సహాయంతో ఆధునీకరించిన పెదగంట్యాడ తహల్దార్‌ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

సమష్టి కృషితో అభివృద్ధి సాధ్యం
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున

కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున

ఆధునీకరించిన తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభం

పెదగంట్యాడ, జనవరి 28: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున అన్నారు. ప్రభుత్వ నిధులు, దాతల సహాయంతో ఆధునీకరించిన పెదగంట్యాడ తహల్దార్‌ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ తహశీల్దార్‌ కార్యాలయానికి ఆధునీకరణ పనులు చేపడతామని అధికారులు తెలిపిన వెంటనే రూ.ఐదు లక్షలు మంజూరు చేశామని, ప్రభుత్వ నిధులకుతోడుగా స్థానికంగా పలువురు దాతలు కొంతమేర నిధులు సమకూర్చడం ప్రశంసనీయమన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది మరింత చొరవ చూపాలన్నారు. రానున్నది ఎన్నికల కాలం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, మంచి పనితీరునపి కనపరచాలని కలెక్టర్‌ సూచించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ నాడు-నేడు పనుల స్ఫూర్తితో ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధికి అధికారులు తీసుకుంటున్న చర్యలు హర్షణీయమన్నారు. కలెక్టర్‌ సహకారంలో నియోజకవర్గంలో 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేశామన్నారు. అనంతరం కార్యాలయ అభివృద్ధికి సహకరించిన దాతలను కలెక్టర్‌, ఎమ్మెల్యే, జేసీలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ కేఎస్‌ విశ్వనాధన్‌, విశాఖ ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, భీమిలి ఆర్డీవో భాస్కరరెడ్డి, తహశీల్దార్‌ రమాదేవి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బీఎన్‌ పాత్రుడు, పులి లక్ష్మీబాయి, శ్రావణి షిప్పింగ్‌ అధినేత సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:49 PM