నర్సరీల్లో ఔషధ మొక్కల పెంపకం
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:03 AM
రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీల్లో ఔషధ మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే అన్నారు. శనివారం మండలంలోని సింగందొరపాలెం శివారు కొత్తూరు అగ్రహారంలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వచ్చే ఏడాది మార్చినాటికి ప్రతి నర్సరీలో ఔషధ మొక్కలు అందుబాటులోకి తీసు కువస్తామన్నారు. ఇక్కడ నర్సరీలు బాగున్నాయని, వివిధ జాతుల మొక్కలను ఉచితంగా తీసుకు వెళ్లి పొలాలు, స్కూళ్ల ఆవరణల్లో నాటు కోవచ్చునన్నారు. నర్సరీని నిర్వహించిన వన సేవకుడు సిరికి గోవిందను రాహుల్ పాండే అభినందించారు. అలాగే మండలంలోని బత్తివానిపాలెం నర్సరీని కూడా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా సోషల్ ఫారెస్ట్ (డీఎఫ్‌ఓ) జి.లక్ష్మణ్, అనకాపల్లి ఫారెస్ట్ రేంజర్ అధికారి చంద్రశేఖర్, అడిషనల్ ఫారెస్ట్ రేంజర్ అధికారి నూకరాజు, సిబ్బంది ఉన్నారు.

- అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే
కె.కోటపాడు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీల్లో ఔషధ మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే అన్నారు. శనివారం మండలంలోని సింగందొరపాలెం శివారు కొత్తూరు అగ్రహారంలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వచ్చే ఏడాది మార్చినాటికి ప్రతి నర్సరీలో ఔషధ మొక్కలు అందుబాటులోకి తీసు కువస్తామన్నారు. ఇక్కడ నర్సరీలు బాగున్నాయని, వివిధ జాతుల మొక్కలను ఉచితంగా తీసుకు వెళ్లి పొలాలు, స్కూళ్ల ఆవరణల్లో నాటు కోవచ్చునన్నారు. నర్సరీని నిర్వహించిన వన సేవకుడు సిరికి గోవిందను రాహుల్ పాండే అభినందించారు. అలాగే మండలంలోని బత్తివానిపాలెం నర్సరీని కూడా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా సోషల్ ఫారెస్ట్ (డీఎఫ్‌ఓ) జి.లక్ష్మణ్, అనకాపల్లి ఫారెస్ట్ రేంజర్ అధికారి చంద్రశేఖర్, అడిషనల్ ఫారెస్ట్ రేంజర్ అధికారి నూకరాజు, సిబ్బంది ఉన్నారు.