ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకుల పంట
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:16 AM
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు.

విశాఖ విద్యార్థులకు అగ్రికల్చర్/ఫార్మసీలో రాష్ట్రస్థాయిలో 8, 9 ర్యాంకులు
ఇంజనీరింగ్‌లో 11, 13, 20, 31, 34, 39, 43, 52, 55, 60, ఎం.రిషీ వర్దన్ 63, 70, 81, 82, 89, 93, 97 ర్యాంకులు
అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 100లోపు పాతిక మందికి ర్యాంకులు
విశాఖపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. అగ్రికల్చర్/ఫార్మసీ స్ట్రీమ్‌లో నగర పరిధిలోని వడ్లపూడికి చెందిన శంబంగి మనో అభిరామ్ ఎనిమిది, గాజువాక బీసీ రోడ్డుకు చెందిన శరగడం పావనికి తొమ్మిదో ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్‌కు సంబంధించి మణికంఠ పృథ్వీరాజ్ 11వ ర్యాంకు, ఎం.బాలాదిత్య 13, సీహెచ్ చక్రధర్ 20, ఎం.సాయిశివలోచన్ 31, రెడ్డి అనిల్ 34, ఎస్.జ్యోతిరాదిత్య 39, తోట ధీరజేశ్వర్ 43, ఎం.హర్షవర్దన్ 52, డి.వర్దన్ 55, రాజేష్ 60, ఎం.రిషీ వర్దన్ 63, బి.తన్మయ 70, చింతు సతీష్‌కుమార్ 81, ఎ.హేమంత్ 82, జి.పవన్‌కుమార్ 89, పీఎస్ నారాయణ 93, కె.కుశాల్ 97వ ర్యాంకు సాధించారు. ఇక అగ్రికల్చర్/ఫార్మసీలో కేఎస్‌ఎస్ పవన్‌కుమార్ 32, జె.మారుతి 48, డి.సూర్యచంద్ర 49, జి.రియాజ్ 55, వై.శశికృతి 60, టి.సుహిత్ర 86, జి.జైకిషోర్ 89, బి.జయదీప్ 99వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్/ఫార్మసీ స్ట్రీమ్‌లలో పాతిక మంది చొప్పున 100లోపు ర్యాంకు సాధించారు. నగరంలోని శ్రీచైతన్య, నారాయణ, శ్రీవిశ్వ, అసెంట్, ఆకాష్ తదితర కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులు ఎక్కువగా 1000లోపు ర్యాంకులు ఎక్కువగా సాధించారు. ఏపీఈఎపీసెట్‌లో టాప్ ర్యాంకర్లంతా దాదాపు ఐఐటీ/ఎన్‌ఐటీలలో ప్రవేశాలను అనువుగా ర్యాంకులు సాధించినవారే.
జిల్లాలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్/ఫార్మశీలో టాప్ 10 ర్యాంకర్లను సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రస్థాయి ర్యాంకులను పరిగణనలో తీసుకుని మచ్చా బాలాదిత్య ఒకటో ర్యాంకు (రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు), రెడ్డి అనిల్ రెండోర్యాంకు (34వ ర్యాంకు), తోట ధీరజేశ్వర్ మూడో ర్యాంకు (43వ ర్యాంకు), డి.శ్రీనిధి నాలుగోర్యాంకు (55వ ర్యాంకు), ఐ.రాజేష్ ఐదో ర్యాంకు (60వ ర్యాంకు), బి.అనిల్ ఆరో ర్యాంకు (70 వ ర్యాంకు), పి.షణ్ముఖ సాయి అమృత్ ఏడో ర్యాంకు (126వ ర్యాంకు), కె.హంసిని ఎనిమిదో ర్యాంకు (182వర్యాంకు), కె. వెంకటవైభవ్ తొమ్మిదోర్యాంకు (204వ ర్యాంకు),పి. సాయిదేవచరణ్ పదో ర్యాంకు (224వర్యాంకు) లభించాయి.