కౌలు రైతులకూ పంట రుణాలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:19 AM
బ్యాంకులు వ్యవసాయ, విద్యా, ఉపాధి రంగాలకు లక్ష్యాలకు మించి రుణాలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ త్రైమాసిక సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఇ-క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలన్నారు.

వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాలకు విరివిగా రుణాలు అందించాలి
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
బ్యాంకర్లకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బ్యాంకులు వ్యవసాయ, విద్యా, ఉపాధి రంగాలకు లక్ష్యాలకు మించి రుణాలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ త్రైమాసిక సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఇ-క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించాలని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలు అందించాలని, కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రుణమేళాలు నిర్వహించి రుణాలు మంజూరు చేయాలని ఆమె సూచించారు. నిరర్థక ఖాతాలలో గల డబ్బులను సంబంధికులను గుర్తించి అందజేయాలని తెలిపారు. సదరు ఖాతాదారులను గుర్తించడానికి డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆదేశించారు. తోటలు, కూరగాయలు, పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను ప్రోత్సహించాలన్నారు. బ్యాంకులు, నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణ జిల్లాలో గల ఫార్మా కంపెనీలలో గల ఉద్యోగాలకు అవసరమైన అంశాలలో అందించాలని తెలిపారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.మ