Share News

స్వాట్‌ స్వాట్‌తో ఉద్రిక్తతలు అదుపు

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:42 AM

అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ఇతర ప్రదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఆందోళనకారులు, నిరసనకారులను అదుపు చేయడం, గుంపులను చెదరగొట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది సభ్యులతో ఏర్పాటైన స్వాట్‌ టీమ్‌ను ఉపయోగించనున్నట్టు చెప్పారు.

స్వాట్‌ స్వాట్‌తో ఉద్రిక్తతలు అదుపు
స్వాట్‌ స్వాట్‌కు గన్‌ ఫైరింగ్‌పై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

30 మందితో ఏర్పాటు

జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ఇతర ప్రదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఆందోళనకారులు, నిరసనకారులను అదుపు చేయడం, గుంపులను చెదరగొట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది సభ్యులతో ఏర్పాటైన స్వాట్‌ టీమ్‌ను ఉపయోగించనున్నట్టు చెప్పారు. మంగళవారం కైలాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు ప్రధాన కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్వాట్‌ టీమ్‌తో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, స్వాట్‌ టీమ్‌ ప్రత్యేక యూనిఫామ్‌ ధరించి విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ టీమ్‌ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన హెల్మెట్‌, లాఠీ, స్టోన్‌ గార్డు, లాంగ్‌ రేంజ్‌, షార్ట్‌ రేంజ్‌ షెల్స్‌, స్మోక్‌ షెల్స్‌ను, గ్యాస్‌ గన్‌ ఫైర్‌, రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు మన్మథరావు, రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:42 AM