కొనసాగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Mar 04 , 2024 | 11:22 PM
ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గత మూడు రోజులుగా క్రమంగా తగ్గుతున్నాయి. అయినా పగటి వేళఎండ ప్రభావం కొనసాగుతున్నది. జి.మాడుగులలో 11, పాడేరులో 12.6, అరకులోయలో 12.8, హుకుంపేటలో 13.3, పెదబయలులో 13.2, ముంచంగిపుట్టులో 13.8, అనంతగిరిలో 15.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి.
తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గత మూడు రోజులుగా క్రమంగా తగ్గుతున్నాయి. అయినా పగటి వేళఎండ ప్రభావం కొనసాగుతున్నది. జి.మాడుగులలో 11, పాడేరులో 12.6, అరకులోయలో 12.8, హుకుంపేటలో 13.3, పెదబయలులో 13.2, ముంచంగిపుట్టులో 13.8, అనంతగిరిలో 15.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. గత మూడు రోజులుగా ఏజెన్సీలో అనంతగిరి మినహా ప్రాంతాల్లో ఒకటి రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. పాడేరు మినహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఒక మోస్తరుగా పొగమంచు కురిసినప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండ ప్రభావం అధికంగానే ఉంది.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం చింతపల్లిలో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. శీతాకాలం ఆఖరిలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరోసారి నమోదు కావడంతో చలికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలితో పాటు ఉదయం వేళల్లో మంచు దట్టంగా కురుస్తున్నది.