స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:16 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడంతో చలి ప్రభావం సైతం కొనసాగుతున్నది. దీంతో మంగళవారం జి.మాడుగులలో 13.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, చింతపల్లిలో 13.6, జీకేవీధిలో 14.3, అరకులోయలో 14.4, ముంచంగిపుట్టులో 14.6, అనంతగిరిలో 14.7, డుంబ్రిగుడలో 14.8, పెదబయలులో 15.2, పాడేరులో 15.5, హుకుంపేటలో 13.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొనసాగుతున్న చలి ప్రభావం
జి.మాడుగులలో 13.3, చింతపల్లిలో 13.6 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడంతో చలి ప్రభావం సైతం కొనసాగుతున్నది. దీంతో మంగళవారం జి.మాడుగులలో 13.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, చింతపల్లిలో 13.6, జీకేవీధిలో 14.3, అరకులోయలో 14.4, ముంచంగిపుట్టులో 14.6, అనంతగిరిలో 14.7, డుంబ్రిగుడలో 14.8, పెదబయలులో 15.2, పాడేరులో 15.5, హుకుంపేటలో 13.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తుంది. దీంతో లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా చలి వణికిస్తోంది. ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.