Share News

ఎన్నికల్లో బలమైన శక్తిగా కాంగ్రెస్‌ పార్టీ

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:14 AM

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలమైన శక్తిగా నిలుస్తుందని, ఆరు ఎంపీ.. 30 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారనున్నదని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. గురువారం ఉదయం హోటల్‌ మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికల్లో బలమైన శక్తిగా కాంగ్రెస్‌ పార్టీ
అభివాదం చేస్తున్న పులుసు సత్యనారాయణరెడ్డి, తదితరులు

విశాఖ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలమైన శక్తిగా నిలుస్తుందని, ఆరు ఎంపీ.. 30 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారనున్నదని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. గురువారం ఉదయం హోటల్‌ మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు చేస్తున్న యత్నాలు, కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజా, ఉద్యమ సంఘాలు చేస్తున్న పోరాటాన్ని ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా చూపించామన్నారు. ఈ చిత్రం కాంగ్రెస్‌ పార్టీకి మరిన్ని ఓట్లను తీసుకువస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీలను అమలు చేయడం సాధ్యపడుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టాయని ఆయన విమర్శించారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తి పీసీపీ అధ్యక్షురాలు షర్మిల మాత్రమేనని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు గంపా గోవిందరావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అడ్డాల వెంకట వర్మరాజు, వాసుపల్లి సంతోశ్‌, లక్కరాజు రామారావు, గుత్తుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 01:14 AM