టీడీపీ ఫ్లెక్సీ, ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆందోళన
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:03 AM
మండలంలోని జానకిరాంపురం గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీ చించివేత, ఎన్టీఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలని టీడీపీ శ్రేణులు గురువారం రాత్రి ఆందోళన చేశారు.

ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని టీడీపీ శ్రేణుల డిమాండ్
రోలుగుంట, జూలై 4: మండలంలోని జానకిరాంపురం గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీ చించివేత, ఎన్టీఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలని టీడీపీ శ్రేణులు గురువారం రాత్రి ఆందోళన చేశారు. గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు, ఎంపీ సీఎం రమేశ్ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని బుధవారం రాత్రి వైసీపీ మద్ధతుదారులైన కొంత మంది వ్యక్తులు చించివేయడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే ఘటనకు కారకులైన వారిని ఇంకా అరెస్టు చేయకపోవడంతో గురువారం రాత్రి 11 గంటలకు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం పక్కన టెంట్ వేసి ఆందోళన చేపట్టారు.