Share News

ధర్మవరం అగ్రహారంలో పాడి రైతుల ఆందోళన

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:16 PM

విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలు ధర తగ్గించడంపై పాడి రైతులు ఆదివారం ధర్మవరం అగ్రహారంలోని పాల సేకరణ కేంద్రం వద్ద ఆందోళన చేశారు.

ధర్మవరం అగ్రహారంలో పాడి రైతుల ఆందోళన
పాల కేంద్రం కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేస్తున్న పాడి రైతులు

ఆవు పాలు ధర తగ్గించడంపై అన్యాయం

29న విశాఖ డెయిరీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు

ఎస్‌.రాయవరం. అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలు ధర తగ్గించడంపై పాడి రైతులు ఆదివారం ధర్మవరం అగ్రహారంలోని పాల సేకరణ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు మాట్లాడుతూ.. విశాఖ డెయిరీ యాజమాన్యం ఎన్నడూ లేని విధంగా ఆవు పాలు ధర ఒకేసారి తగ్గించడం దారుణమన్నారు. పెరిగిన మేత, దాణా ఖర్చుల కారణంగా డెయిరీ ఇస్తున్న పాల ధర గిట్టుబాటు కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విశాఖ డెయిరీ తమ నిర్ణయాన్ని ఉపసంహరించువాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆవు పాలు ధర తగ్గించడాన్ని నిరసిస్తూ ఈనెల 29న ఉదయం గాజువాకలోని విశాఖ డెయిరీ ప్రధాన కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తామని అప్పలరాజు ప్రకటించారు. అనంతరం పాల ధరను వెంటనే పెంచాలని కోరుతూ పాడి రైతులతో కలిసి ఆయన పాల సంఘం అధ్యక్షుడు, వేతన కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పి. శ్రీను, బి. నరసింగరావు, జి. నాయుడు, కె. సూర్యనారాయణ, పి. నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 11:16 PM