ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:33 AM
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయాన్ని తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. గర్భిణులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఇటీవల నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సీటీస్కాన్‌ను పరిశీలించారు.

పలు విభాగాలు పరిశీలన
రోగులకు వైద్య సేవలపై ఆరా
అనకాపల్లి టౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయాన్ని తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. గర్భిణులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఇటీవల నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సీటీస్కాన్‌ను పరిశీలించారు. వైద్య పరీక్షల గురించి టెక్నీషియన్‌లను ప్రశ్నించారు. నిర్మాణంలో వున్న క్రిటికల్ కేర్ బ్లాక్ పనులను పరిశీలించారు. వైద్యాలయానికి ఆనుకుని ఉన్న యల్లయ్య కాలువను పరిశీలించి, ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌కు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వైద్యశాలలో మందుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. త్వరలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యాలయంలో రోగులకు అందుతున్న సేవలు బాగున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఆమె వెంట డీఎంహెచ్‌ఓ బాలాజీ, వైద్యులు, ఉన్నారు. కాగా వైద్యాలయంలో . కంటి విభాగం స్పెషలిస్టు రమణకుమార్‌తో నేత్ర వైద్య పరీక్షలు చేయించుకున్నారు.